67 ఏళ్ల వయుసులో మోడలింగ్‌ చేస్తున్న డాక్టర్

-

ఆరుపదలు వయసులో ఫించన్ తీసుకునే మహిళలను చూశాం.. ఇక ఆ ఏజ్ లో సాధారణంగా ఎవరూ ఏ పని చేయలేరు. ఇంట్లో ఉండే ప్రశాంతంగా రెస్ట్ తీసుకంటారు. ఒకవేళ బయటకు వెళ్లి కష్టపడదాం అన్నా.. బాడీ సహకరించదు. ముఖ్యంగా మహిళలకు 67ఏళ్ల వయసులో అసలు ఏం ఓపిక ఉంటుంది చెప్పండి. మీరు ఇలానే అనుకుంటున్నారేమో.. కానీ ఆ వయసులో కూడా మోడలింగ్ చేస్తొంది ఈ బామ్మ కాదు కాదు.. భామ..! 67 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలో తనదైన శైలితో ఔర అనిపిస్తున్న ఈ డాక్టర్ గురించి మీరు తెలుసుకోండి..!

దిల్లీకి చెందిన డాక్టర్‌ గీతా ప్రకాశ్‌ 57 ఏళ్ల వయసులో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ప్రస్తుతం పలు ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని ఆమె నిరూపిస్తున్నారు. ఓవైపు డాక్టర్‌గా సేవలందిస్తూనే మరోవైపు మోడల్‌గా రాణిస్తోన్న గీతా ప్రకాశ్‌ ఎంతోమందికి ఆదర్శం.

ఛాన్స్ ఎలా వచ్చిందంటే..

వైద్యరంగంలో స్థిరపడ్డ గీతకు ఎప్పుడూ మోడలింగ్‌ చేయాలని ఆలోచించలేదట. పేదల కోసం ఒక ఛారిటబుల్‌ క్లినిక్‌ని సైతం నిర్వహిస్తూ.. వైద్యులుగా సేవలందిస్తూ.. జీవితం అలా గడిపేది.. 57 ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఒక రోజు ఓ ఇటాలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆమె క్లినిక్‌కు వైద్యం చేయించుకోవడానికి వచ్చారు. అతనితో మాట్లాడే క్రమంలో గీతను మోడలింగ్‌ చేయమని అడిగాడట. ఆమె అప్పుడు దానిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కొన్ని రోజులకు అతను ఫోన్‌ చేసి మోడలింగ్‌కు ఫొటోలు పంపమని అడగడంతో ఆమెకు మోడలింగ్‌ చేయాలన్న ఆసక్తి పెరిగిందట. అయితే అప్పటిదాకా మోడలింగ్ అంటే తెలియని గీత సాధారణంగా దిగిన కొన్ని ఫొటోలను అతనికి పంపారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమెకు మొదటి అవకాశం లభించింది. అలా మొదటిసారి తరుణ్‌ తహిలియానికి మోడల్‌గా వ్యవహరించారు. క్రమ క్రమంగా.. పలు ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్‌ చేస్తూ ఎంతోమంది మహిళలకు గీత స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

గీత ఒకవైపు మోడల్‌గా చేస్తునా.. తన వైద్య వృత్తికి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. పని దినాల్లో తన పేషెంట్లకు చికిత్సను అందిస్తూనే వారాంతాల్లో మోడలింగ్‌కు సమయం కేటాయిస్తుంటారు. మరోపక్క తన ఛారిటబుల్ క్లినిక్‌ పనులను కూడా చేస్తుంటారట. ఇంతేనా.. యూట్యూబ్‌లో పలు ఆరోగ్య సమస్యలు.. వాటికి సంబంధించిన చికిత్సల గురించి వీడియోలు కూడా చేస్తుంటారు.

జీవితంలో కొన్ని కారణాల వల్ల మనసుకు నచ్చిన పని పక్కనపెట్టి.. పైసలొచ్చే పని తలపెట్టాల్సి వస్తుంది. కానీ కొన్ని ఏళ్లకు లైఫ్ లో సెటిల్ అయి.. ఒక స్టేజ్ కు వెళ్తారు.. అప్పుడు కూడా మీ కలను సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఏం చేయడానికి అయినా ఏజ్ తో సంబంధం లేదు. ఏజ్ ఈస్ జస్ట్ ఏ నెంబర్ బాస్. కాబట్టి మీ కలలకు వయసుతో ముడిపెట్టుకుని ఆగిపోవద్దుని గీత చెప్పకనే చెప్తున్నారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version