అప్పు తీసుకోవడమే కాదు సరైన సమయంలో చెల్లించాలి. లేదంటే బ్యాంకు వాళ్లు గానీ, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్లు గానీ వెంటబడుతుంటారు. ఒక్కోసారి తీసుకున్న డబ్బు కంటే పెనాల్టీలు, ఇంట్రెస్టులకే ఉన్న డబ్బు మొత్తం పోతుంది. అందుకే రుణం సకాలంలో చెల్లించాలని బ్యాంకు వారు పదే పదే చెబుతుంటారు.
తాజాగా అప్పు చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఏకంగా ఓ ఇంటికి ముందు పొయ్యి పెట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాలో ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని రూ.61 వేలు అప్పు పడింది. అప్పు కట్టాలని గత కొంతకాలంగా బ్యాంకు అధికారులు ఆమెను వేడుకుంటున్నట్లు సమాచారం. చివరకు గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు.
అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని, రూ.61 వేలు అప్పు పడింది
అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు… pic.twitter.com/hXsOvElteg
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025