ఏపీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ వేదికగా జాతీయ పతాకాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గత వైసీపీ ప్రభుత్వం అసమర్థత కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీయే కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించారని, ఏపీలో చంద్రబాబు నాయకత్వాన్ని సైతం స్వాగతించారని తెలిపారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ వెల్లడించారు. పోలవరం,అమరావతి,విశాఖ స్టీల్ ప్లాంట్‌కు.. కేంద్రం సహకారం అందిస్తుందని, స్వర్ణాంధ్ర విజన్ –2047 ప్రణాళికతో పురోగమిస్తున్నామని, ప్రగతి ఫలాలు రాష్ట్ర ప్రజలు అందరికీ అందించడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.