తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. బండి సంజయ్ అరెస్టు పై బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్టానం కూడా తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ గా ఉంది. కాగ బండి సంజయ్ అరెస్టు చేసిన పోలీసులు సోమవారం కోర్టులో ప్రవేశపేట్టారు. బండి సంజయకి కోర్డు 14 రోజుల రిమాండ విధించింది. అయితే బండి సంజయ్ అరెస్టుకు నిరసన గా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు ఆందోళన చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది.
14 రోజుల పాటు అన్ని జిల్లాలలో ఆందోళన చేయాలని ప్రతి రోజు ఒక జాతీయ నాయకుడు ఆందోళనలో పాల్గోంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఇదీల ఉండగా కరీంనగర్ జైల్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు పరామర్శించనున్నారు. అలాగే కరీంనగర్ లో ఉన్న బండి సంజయ్ కార్యాలయాన్ని కూడా కిషన్ రెడ్డి సందర్శిస్తారు. అలాగే బండి సంజయ్ ను అరెస్టు గురించి కార్యకర్తలను అడగి తెలుసుకోనున్నారు. అలాగే ఆదివారం రాత్రి జరిగన ఘటనలో పోలీసుల వ్యవహరించిన శైలిని కూడా కార్యకర్తలను అడిగి తెలుసుకోనున్నారు.