పనిమనిషికి చేయూతనిచ్చి పెద్ద మనసు చాటుకున్న యజమాని.. నెటిజన్లు ఫిదా..!?

-

ఇంటి భోజనం తో వ్యాపారం చేయాలని ఆమె కోరిక ఉన్నప్పటికీ.. ఆర్థిక స్తోమత కారణంగా అది కుదరలేదు… దీంతో పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ తన ముగ్గురు పిల్లల పోషణ చూసుకుంటుంది. కానీ తాజాగా యజమాని ఇచ్చిన చేయూతతో ఆమె మరోసారి ఇంటి భోజనం తో వ్యాపారం ప్రారంభించేందుకు సిసిద్ధమైంది. బెంగళూరులో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తన ఇంట్లో పనిమనిషి… ఇంటి ఆహారంతో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆ యజమాని సహాయం చేశాడు.

బెంగళూరు నివాసి అయిన అంకిత్ వేగులల్కర్.. ఇంట్లో సరోజినీ దిది అనే 47 ఏళ్ల మహిళ పనిమనిషిగా గత సంవత్సరం నుంచి పనిచేస్తుంది. గతంలో తన భర్తతో కలిసి మంగమ్మపాళ్యలో ఒక భోజనం వ్యాపారాన్ని నడిపిన ఆమె భర్త చనిపోవడంతో… వ్యాపారాన్ని వదిలేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇంటి యజమాని అంకిత్ .. తన ఇంటి పనిమనిషి సరోజ దీదీ కి చేయూతనిస్తూ ఇంటి భోజనం తో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమెకు సహాయం చేశారు. ఈ క్రమంలోనే ఇంటి భోజనం కావాలనుకునేవారు తనను సంప్రదించాలి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version