సాంబార్‌లో పడిన బాలుడు.. చికిత్స పొందుతూ మృతి!

-

వేడి సాంబార్‌లో పడిన బాలుడు తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..భీంగల్ పట్టణానికి చెందిన కర్నె నిహారిక తన మూడేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఈ నెల 19న ముచ్కూర్‌లో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఓ శుభకార్యానికి హాజరైంది.

Suspicious death of a 5th class student in the hostel of Gurukula School

అక్కడ పిల్లలతో కలిసి బాలుడు చార్విక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడిగా ఉన్న సాంబార్ బాండీలో పడిపోయాడు. దీంతో బాలుడి శరీరం మీద చర్మం ఊడి రావడంతో వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చార్విక్ మృతి చెందగా.. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news