ఏపీలో ఇప్పుడు వైసీపీ మంచి దూకుడు మీద రాజకీయాలు చేస్తోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్ అన్నట్టు జోరు మీద పనిచేస్తోంది. మరి ఇలాంటి పోటీ వాతావరణంలో టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు చేస్తోంది. ఇక ఆ పార్టీకి సొంత నేతలే సమస్యలు తీసుకువస్తున్నారు. హద్దు మీరిన వ్యాఖ్యలతో టీడీపీ పార్టీని దిగజారుస్తున్నారు చాలామంది నేతలు. ఇక తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు టీడీపీని ఇబ్బందుల్లో పడేశాయి. ఇప్పుడు ఆయన మాటలతో కార్యకర్తల్లో పార్టీ మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీశారు.
ఇటీవల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో గనక ప్రస్తుతం ఎన్నికల వాతావరణమే గనక వస్తే టీడీపీ మాత్రం గెలిచే పరిస్థితి లేదని, వైసీపీదే విజయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన చంద్రబాబు నాయకత్వాన్ని కూడా సవాల్ చేస్తూ ఆయనపై కార్యకర్తలకు ఎలాంటి నమ్మకం లేకపోవడంతో వారంతా కూడా పక్క చూపులు చూస్తున్నారని వివరించారు. దీంతో ఆయన మాటలతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉంటున్నారు. పార్టీలోనే ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కార్యకర్తలు అసంతృప్తితో ఉంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆయనకు సవాల్ విసరుతున్నారు. ఉంటే ఉండు పోతే పో అన్న రేంజ్‌లో పోస్టులు పెడుతున్నారు. ఇక రీసెంట్‌గా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి పల్లె రగునాథరెడ్డి చేసిన పనిపై కూడా తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఆయన ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని పెద్దారెడ్డిని కలవడం, ఆయనతో టిఫిన్ చేయడంపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారు పార్టీకి అవసరం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. పార్టీలో ఉండి పార్టీ ప్రతిష్టను దిగజార్చొద్దంటూ సూచిస్తున్నారు. మరి తమ్ముల్ల రియాక్షన్ కూడా మంచిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.