వారికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.2 లక్షల లోన్.. రూ.15 వేల ఆర్థిక సాయం..!

-

కేంద్రం ఇప్పటికే చాలా స్కీమ్స్ ని తెచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చేతి వృత్తుల వారిని ఆదుకునేందు కోసం కూడా కేంద్రం స్కీమ్ ని తెచ్చింది. ఈ పథకం కోసం రూ. 13 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపింది. వివరాలు చూస్తే.. విశ్వకర్మ యోజన స్కీమ్ కింద దాదాపు 30 లక్షల కుటుంబాలకు లాభం ఉంటుంది. ఈ కొత్త పథకం కింద సబ్సిడీ వడ్డీ రేటుతో తొలిసారి రూ. 1 లక్ష లోన్ ని పొందవచ్చు.

 

రెండో విడతలో రూ. 2 లక్షల దాకా లోన్ వస్తుంది. లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు కేవలం 5 శాతంగానే ఉంటుంది. కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టే వారు, తాపీ పని చేసే వారు, నేత కారులు, స్వర్ణ కారులు, కమ్మరి, తాళాలు చేసే వారు అంతా కూడా ఈ స్కీమ్ లాభాలని పొందవచ్చు. అలానే ఈ శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకుంటే రోజుకు రూ. 500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ని ఇస్తారు.

శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కి రూ. 15 వేల ఆర్థిక సాయం ఇస్తారు. అలానే పీఎం ఇ-బస్ సేవా పథకానికి కూడా కేంద్రం ఒకే చెప్పింది. ఈ స్కీమ్ కోసం రూ. 57,613 కోట్లు కేటాయించింది. 10 వేలబస్సులను అందుబాటులోకి తీసుకు రానున్నారు. 169 పట్టణాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి. ఈ స్కీమ్ కింద బస్ సేవలకు రూ.10 వేల వరకు ప్రోత్సాహం ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version