ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్..!

-

ఏపీలో కొంతమంది ఎమ్మెల్సీల రాజీనామాతో… ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీకి .. సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

నామినేషన్ల దాఖలు ప్రక్రియ కు చివరి తేదీ ఈ నెల 13వ తేదీ అని ప్రకటించగా… ఈ నెల 24న ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు జరిగిన రోజే సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత ఫలితాన్ని కూడా ప్రకటిస్తారు. ఇక ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలు… గెలుపు కోసం పలు వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version