అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్ : ఏపీ సీఎం

-

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు 90 శాతం పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిగ్రీ విద్యా కోర్సులలో 10 నెలల పాటు అప్రెంటీస్ గా ప్రతి విద్యార్థి చేసేలా చర్యలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనా కోర్సులను విద్యార్థులకు బోధించాలని జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.

Cm Jagan

నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన కోర్సులను నేర్చుకుంటేనే ఆనర్స్ డిగ్రీ విద్యార్థులకు సమర్పించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపారు. ఎంసెట్ లాంటి ప్రవేశపరీక్షల తేదీల గురించి సెప్టెంబర్ నెలలో తమ నిర్ణయాలుగా ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.అక్టోబర్ 15వ తేదీన కాలేజీలు తెరుచుకుంటాయని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. విజయనగరం ప్రకాశం జిల్లా లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నామని జగన్ తెలిపారు. అక్రమాలకు పాల్పడే ప్రతి కళాశాల పై కఠిన చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version