సామాజిక దూర జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్ -19 రోగి నుంచి 30 రోజుల్లో 406 మందికి సోకుతుందని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి సామాజిక దూరం మరియు మాస్క్ ల వాడకం అనేది చాలా అవసరం అని కేంద్రం స్పష్టం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ విషయాన్ని అనేక విశ్వవిద్యాలయాలు పరిశోధించాయని ఆయన వెల్లడించారు. క్లినికల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టడం అవసరమని ఆయన అన్నారు. ఆరు అడుగుల దూరంలో ఉన్నా సరే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కరోనా సోకే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మాస్క్ లు ఉంటే వ్యాధి బారిన పడే అవకాశం 1.5 శాతం అని ఆయన తెలిపారు.