కొన్ని కొన్ని సార్లు మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కొన్ని కొన్ని సార్లు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
తిరుపతి లోని బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న భాను ప్రకాష్ జయంతి దంపతులకు ఇద్దరు కూతుర్లు. అయితే పెద్ద కూతురు ఇటీవలే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. అయితే చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు దీంతో ఆందోళన చెందుతున్న సమయంలో ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో కనిపించింది వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు.