నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మారిపోయాయి అధికార ప్రతిపక్షాల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు ఎన్నో డిమాండ్లను అధికార పక్షం ముందు ఉంచారు. ఇంకా ఇటీవలే భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి అంటు టిడిపి నేతలు అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే భారీ వర్షాల కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రైతులకు ఇప్పటికికూడా పంట నష్టం అందించకపోవడాన్ని తెరమీదకు తెచ్చిన టిడిపి అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసింది ఈ క్రమంలోనే స్పీకర్ పోడియం కింద కూర్చొని చంద్రబాబు నిరసన వ్యక్తం చేయడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే స్పందించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు… చంద్రబాబు కావాలనే అసెంబ్లీలో డ్రామాలు చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.