సీఎం రేవంత్ రెడ్డి ముందు చెప్పిన విధంగా గురువారం ఉదయం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్‌ను ప్రారంభించారు. మంచిరేవులలో తొలి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా.. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీలు, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.
ఈ పాఠశాలల్లో పోలీస్ సిబ్బంది కుటుంబాలకు 50% సీట్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి.మిగతా సీట్లను సివిలియన్స్ పిల్లలకు కేటాయించనున్నారు. ఇందులో CBSE సిలబస్, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.