కలెక్టర్ ఇలా త్రిపాఠిపై మండలి చైర్మన్ సీరియస్.. నోటీసులు జారీ

-

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. కొద్ది రోజుల కిందట గుత్తా సుఖేందర్ రెడ్డి ఉపాధి హామీ ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ రద్దు చేసినట్లు తెలిసింది.

దీంతో కలెక్టర్ నిర్ణయంపై మండలి చైర్మన్ ఆగ్రహించారు.ఈ క్రమంలోనే కలెక్టర్ త్రిపాఠికి అసెంబ్లీ సెక్రెటరీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ త్రిపాఠి స్వయంగా వచ్చి మండలి చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం.కాగా,ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ అంశం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news