అనంతపురం జిల్లాలో పరువు హత్య..కూతురికి ఉరేసి చంపి.. పెట్రోల్ పోసి !

-

అనంతపురం జిల్లాలో పరువు హత్య జరిగింది. కూతురికి ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించాడు తండ్రి. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని కూతురిని చంపేశాడు తండ్రి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రామాంజనేయులుకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు, డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చిన్న కూతురు భారతి (21) హైదారాబాద్లొ డిగ్రీ చదువుతున్న యువకుడిని ప్రేమించింది.

The father who burnt his daughter to death and set her on fire with petrol

అతను వేరే కులానికి చెందిన వాడని, మరిచిపోవాలని తండ్రి మందలించినా కూతురు వినలేదు. ఈ నెల ఒకటో తేదీన తన కూతురుని బండిపై ఎక్కించుకొని గుంతకల్లు మండలం కసాపురానికి తీసుకెళ్ళి మరొకసారి మందలించనా కూతురు వినలేదు. దీంతో బలవంతంగా చెట్టుకి ఉరి వేసి చనిపోయాక తన బండి నుండి పెట్రోల్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version