నెలలు నిండని చిన్నారి పట్ల ఓ కసాయి తండ్రి కర్కషంగా ప్రవర్తించాడు. తనకు పుట్టలేదనే అనుమానంతో 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించాడు.ఈ ఘటన ఏపీలోని ఒంగోలు రూరల్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. ఒంగోల్ రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్‌రావు,లక్ష్మి దంపతులు పది రోజుల క్రితం వచ్చారు.
ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది. ఈ క్రమంలోనే ఆ పాప తనకు పుట్టలేదని అనుమానం పెంచుకున్న ఆ తండ్రి చిన్నారి వైష్ణవికి తండ్రి యాసిడ్ తాగించాడు. చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తల్లి గుర్తించి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. బాధిత తల్లికి అసలు విషయం తెలియంతో స్థానికుల సాయంతో 108 వాహనంలో చిన్నారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.