ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునే భక్తులకు ఊహించని షాక్ తగిలింది. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు నిలిపి వేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు… నిలిపి వేస్తున్నట్లు తాజాగా ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. ఈనెల ఆరవ తేదీన జరిగే మహాగణపతి శోభాయాత్ర ఏర్పాట్ల కోసం… గణపతి నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

శనివారం రోజున ఉదయం 6 గంటల సమయంలోనే ఖైరతాబాద్ విగ్రహ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. సైఫాబాద్ ఓల్డ్ పిఎస్ నుంచి ఇక్బాల్ మినార్ అలాగే తెలుగు తల్లి ఫ్లై ఓవర్.. అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనం జరుగుతుంది. ఇక ఖైరతాబాద్ శోభాయాత్రలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు.