తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమకు ప్రతి నెల రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్ల డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల ముందు తమకు అనేక హామీలు ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు రేషన్ డీలర్ల సంఘం అద్యక్షుడు బత్తుల రమేష్ బాబు. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం. దింతో రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ కానున్నాయి.