టీమిండియా ఇటీవల సౌతాఫ్రికా టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిదే. అందులో భాగంగా నేటి నుంచి సౌతాఫ్రికా తో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ ను ఆడనుంది. సౌతాఫ్రికాలోని సెంచూరియన్ వేదిక గా తొలి టెస్టు జరగనుంది. ఈ రోజు మధ్యహ్నం 1 :30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కు టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే కెప్టెన్ గా విరాట్ కోహ్లికి గడ్డు కాలం నడుస్తున్న వేల ఈ టెస్ట్ సిరీస్ వస్తుంది. దీంతో ఈ టెస్ట్ సిరీస్ గెలవడం విరాట్ కోహ్లి కి చాలా కీలకం. అయితే మూడు మ్యాచ్ సిరీస్ లో తొలి మ్యాచ్ లో నెగ్గాలని భారత్ తాపాత్రయ పడుతుంది. కాగ సఫారీ జట్టు గతంలో కన్న ఈ మ్యాచ్ కు బ్యాటింగ్ పరంగా బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే తొలి మ్యాచ్ లో నెగ్గి.. సిరీస్ వేటలో ఉండాలని టీమిండియా కష్ట పడుతుంది. అంతే కాకుండా సౌతాఫ్రికా లో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు. దీంతో ఈ సారి టెస్ట్ సిరీస్ గెలిచి రికార్డు సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది.