రద్దు చేసిన సాగు చట్టాటాను మళ్లీ తీసుకువస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. సాగు చట్టలపై ముందడుగు వేస్తామంటు వ్యవసాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్షమాపణలను అవమానించడమే అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సాగు చట్టాలపై బీజేపీ మాట మారుస్తుందని తాము ముందే ఉహించామని అన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా కూడా కేంద్ర మంత్రి వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే సాగు చట్టాలను రద్దు చేశారని అన్నారు. ఎన్నికల తర్వాత తిరిగి తీసుకువస్తారని అన్నారు. పంజాబ్ తో పాటు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రలలో రాబోతున్న అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ ఓడించాలని అన్నారు.