మీ మనస్సుని ప్రభావితం చేసి ప్రశాంతంగా ఉంచే ఆహారాలు..

-

కరోనా టైమ్ లో ఆహారంపై శ్రద్ధ అందరికీ పెరిగింది. ఏ ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న వివరాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కరోనా టైమ్ లో ఆహారం మీద ఆమాత్రం జాగ్రత్త తప్పకుండా అవసరం. ఐతే లాక్డౌన్ టైమ్ లో ఇంట్లోనే ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకే చోట కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి మెదడుపై భారం బాగా పెరుగుతుంది. దీన్ని తట్టుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాలి. మీ మూడ్ ని సరిగ్గా ఉంచే ఆహారాలు ఏంటో తెలుసుకోండి.

బెర్రీలు

ఆహారంలో పండ్లని భాగం చేసుకోవడం వల్ల డిప్రెషన్ ని తగ్గించవచ్చు. వాటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి, డిప్రెషన్ తగ్గుతుంది. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇంకా ఫినాలిక్ ధర్మాలు ఉంటాయి కాబట్టి ఒత్తిడిని ఎదుర్కోవడంలో సాయపడతాయి.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మీ మూడ్ ప్రశాంతంగా మారుతుంది. ఇంకా సంతోషంగా ఉండగలుగుతారు. ఎండార్ఫిన్లని పురికొల్పడంలో సాయపడుతుంది. ఇది మెదడుకి రక్తాన్ని పంపే తీరును పెంచుతుంది. దానివల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానివల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

సాల్మన్ చేప

సాల్మన్ చేపలో ఒమెగా 3 కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి మన మూడ్ ని ప్రశాంతంగా ఉంచుతాయి. మన శరీర కణాల నిర్మాణంలో ఒమెగా 3కొవ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా చర్మాన్ని, జుట్టుని సంరక్షించి రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.

గింజలు, విత్తనాలు

గింజలు, విత్తనాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మూడ్ కి సంబంధించిన హార్మోన్లని ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. గుమ్మడికాయ, నువ్వులు, సూర్యపువ్వు విత్తనాలు, బాదం, కాజు, పల్లీలు, వాల్ నట్స్ మొదలగు వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.

పాలకూర

సెరెటోనిన్ మీద బాగా ప్రభావం చూపే పాలకూర తినడం వల్ల మూడ్ ప్రశాంతంగా ఉంటుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కావున ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version