తెలంగాణలో మరో జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే గ్రామగామాల్లోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో జాతరలకు సమయం ఆసన్నమైంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వ్యాప్తంగా లక్ష్మీనరసింహ స్వామి జాతరలు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి.
ప్రతిఏడాది వేసవి సమయంలో ఇలా జాతరలను నిర్వహించడం రాష్ట్రంలోని ప్రజలకు ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలోనే ఈనెల నుంచి పెద్దగట్టు జాతర నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్లాట్లను చేస్తున్నది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం దురాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 20 వరకు ఈ జాతర వేడుకలను నిర్వహించనున్నారు. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా దీనికి పేరుంది. దీనికి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. కాగా, ఇటీవలే కొమురవెళ్లి మల్లన్న స్వామి జాతర ముగిసిన విషయం తెలిసిందే.