వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ దారుణహత్య

-

ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్ధన రావు దారుణహత్య గురయ్యాడు. అయితే.. ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్ధన రావు దారుణహత్య వివరాలు ఇలా ఉన్నాయి. జనార్ధన రావుకు ఇద్దరు కుమార్తెలు, మొదటి కుమార్తె కొడుకును కంపెనీకి డైరెక్టర్‌గా నియమించారు. కాగా.. రెండు కుమార్తె కొడుకు కిలారు కీర్తితేజ పేరిట రూ.4 కోట్లు షేర్లను బదిలీ కావడంతో గొడవలు మొదలయ్యాయని సమాచారం అందుతోంది.

ఇక ఈ క్రమంలోనే మనవడు కీర్తితేజ తాతయ్యతో వాగ్వాదానికి దిగాడు.. ఆగొడవ కాస్త పెద్దది కావడంతో కత్తితో తాతయ్యను 73సార్లు పొడిచాడని అంటున్నారు. అటు అడ్డువచ్చిన తల్లిపై కూడా కీర్తితేజ నాలుగు చోట్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యడని సమాచారం. అటు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు కీర్తితేజను అదుపులోకి తీసుకున్నారని తెలు తోంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news