c. మరికొన్ని ఏకంగా విధుల నుంచే తొలగిస్తున్నాయి. అయితే ఢిల్లీలోని బక్తవర్ గ్రామానికి చెందిన పప్పన్ సింగ్ అనే రైతు మాత్రం.. తన పొలంలో పని చేస్తున్న రైతులకు అండగా నిలుస్తున్నాడు. లాక్డౌన్లో సొంతూళ్లకు వెళ్లిపోయిన వారిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకోసం వారందరికీ విమాన టికెట్లు బుక్ చేశాడు ఆ రైతు.
పప్పన్ సింగ్ పొలంలో అనేకమంది కూలీలు పనిచేస్తుంటారు. అయితే కరోనా కారణంగా వారందరూ బిహార్లోని సొంతూళ్లకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు కూడా తన సొంత ఖర్చులతోనే వారందరూ విమానంలో సొంతూళ్లకు చేరుకునే ఏర్పాట్లు చేశాడు పప్పన్ సింగ్.ఇప్పుడు వారందరినీ వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం 21 విమాన టికెట్లు తీశాడు. ఒక్కో టికెట్ ధర రూ.5,200.
ఇదే కాకుండా.. కూలీల కుటుంబసభ్యులకు కూడా అండగా ఉంటున్నాడు ఈ రైతు. కూలీలకు తోడుగా వారి కుటుంబసభ్యులు కూడా ఢిల్లీకి వచ్చే ఏర్పాట్లు చేశాడు. వారి ప్రయాణానికి అయ్యే సగం ఖర్చు తానే భరిస్తున్నాడు. వారు పనిచేయకపోయినప్పటికీ… పొలంలో పనిచేసే కూలీలతో కలిసి ఉంటారని పేర్కొన్నాడు.