గత పదేళ్లలో దారుణంగా పడిపోయిన భూగర్భ జలాలు

-

రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. 33 జిల్లాల స్థితిగతులను పరిశీలించి భూగర్భజల శాఖ ఈ నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం డిసెంబర్ నెలలో 6.7 మీటర్ల లోతున ఉండే జలాలు.. జనవరికి 7.46 మీటర్ల లోతుకు పడిపోయాయి.

ఒకే నెలలో 0.74 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయినట్లు ఈ నివేదిక స్పష్టంచేసింది. 156 మండలాల్లో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితిలో భూగర్భ జలాలు పడిపోయినట్లు తెలుస్తోంది. వేసవి రాకముందే ఇంత దారుణంగా ఉంటే రానున్న రోజుల్లో తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news