బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బాంబ్ పేల్చారు. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం 42 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కులగణన సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.160 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం వీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బీసీ రిజర్వేషన్లపై బాంబ్ పేల్చారు. బీసీలకు 42% కోటాను వెంటనే అమలు చేయలేమని స్పష్టంచేశారు. పార్లమెంట్లో ఆమోదం పొందకుండా అమలు చేయడం అసాధ్యమని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ మరోసారి మాట మార్చిందని, అమలు సాధ్యం కానప్పుడు ఎందుకు ప్రకటన చేశారని సోషల్ మీడియా వేదికగా బీసీ వర్గీయులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
160 కోట్లు ఖర్చు పెట్టి కుల గణన చేసి బాంబ్ పేల్చిన రేవంత్ రెడ్డి
బీసీలకు 42% కోటాను వెంటనే అమలు చేయలేము
పార్లమెంట్లో ఆమోదం పొందకుండా అమలు చేయడం అసాధ్యం
మీడియాతో చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి pic.twitter.com/R9nLkyxTCv
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2025