అన్నమయ్య జిల్లాలో సచివాలయ ఉద్యోగుల చేతివాటం..

-

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. జిల్లాలోని రాయచోటిలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు ఓ దరఖాస్తు దారుడి నుంచి లంచం తీసుకుని డబ్బులు పంచుకున్నట్లు ఓ రికార్డింగ్ ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మాసాపేటలోని ఒకటవ సచివాలయం అడ్మిన్‌గా పనిచేస్తున్న సాయి.. యాజమాని మస్తాన్ వద్ద నుంచి ఇంటి పన్ను దరఖాస్తు ఫీజు కోసం 12వేల రూపాయల అక్రమంగా వసూలు చేసినట్లు సమాచారం. అనంతరం మున్సిపల్ ఆర్ఐ గౌసియా, కంప్యూటర్ ఆపరేటర్ చక్రవర్తి కలిసి నగదును పంచుకున్నట్లు సాయి మాట్లాడని ఆడియో బయటకు వచ్చింది. దీంతో వారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. కింది స్థాయిలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించడంపై ప్రజలు సైతం ఫైర్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version