మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు.. వేసవిలో ఎక్కువగా లభించే ఈ పండ్లకు సీజన్ లో మంచి డిమాండ్ ఉంది.. పండ్లు అన్నిటికన్నా గొప్పది మామిడి అని పెద్దలు చెబుతుంటారు. తియ్యగా,పుల్లగా, వగరుగా లభించే ఈ పండ్లను వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు..ఒకవైపు వేసవి మండుతున్నా కూడా మరో వైపు ఈ పండ్లను తింటారు. ఏడాదిలో ఒకసారి దొరికే ఈ పండ్లకు ప్రపంచమంతటా ఫ్యాన్స్ ఉన్నారు.
మామిడి పండ్ల లో ఎన్నో రకాలు ఉంటాయి.. అయితే వాటి సైజు ఎంత పెద్దగా ఉన్నా కూడా అవి కేజీకి మించి బరువు ఉండవు.కానీ మీరు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మామిడి పండ్లను చూశారా ? అవి దాదాపు 4 కిలోల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ ఈ పండ్లు మన దేశంలో లేవండోయ్. కొలంబియా దేశంలో ఈ అరుదైన మామిడి పండ్లు ఉన్నాయి.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మామిడి ప్రియుల డిమాండ్ తీర్చేందుకు కొలంబియాకు చెందిన ఇద్దరు రైతులు ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడిని పండించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కారు. జర్మన్ ఒర్లాండ్ నోవోవా అతని భార్య రీనా మారియా మారోక్విన్ ఈ మామిడి పండ్లను పండించారు. వీటి బరువు దాదాపు 4.25 కిలోలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే ఇన్ స్టా యూజర్ ఈ పండ్ల గురించి పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి పండ్ల ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. నిజంగా ఇంత బరువు మామిడి కాయల గురించి వింటూంటే ఆశ్చర్యంగా ఉన్నా కూడా నిజంగానే ఇవి ఉన్నాయి..గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న ఆ మామిడి పండ్లను మీరు ఒకసారి చూసేయ్యండి..