అత్యాశకి పోయి తన కెరీర్నే నాశనం చేసుకుంటున్నా హీరోయిన్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెన చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ కృతిశెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వరుసగా మూడు విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరో రామ్ తో వచ్చిన దివారియర్, నితిన్ తో నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రాలు రెండూ డిజాస్టర్ గా మిగిలాయి. ఇక ఉప్పెన సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ముద్దుగుమ్మకు పలు ఆఫర్లు కూడా వచ్చాయి. దీంతో అన్నిటికీ ఓకే చెప్పి తన కెరీర్ ని ముందుకి తీసుకువెళ్తోంది. అలా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా వదులుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.ప్రస్తుతం తమిళ హీరో సూర్య, తెలుగు హీరో సుధీర్ బాబు హీరోలుగా చేస్తున్న సినిమాలో నటిస్తున్నది. వీటిలో ఇప్పటికే వైష్ణవ తేజ్, నాని, నాగచైతన్య, రామ్ సినిమాలు వచ్చాయి. అయితే వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నప్పటికీ కృతికి రామ్ సినిమా దివారియర్ ఫస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ తో ఈ అమ్మడు బాగానే ఉపేసింది. కానీ మంచి విజయాన్ని అయితే సినిమా అందుకోలేక పోయిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె 5వ సినిమా ఇప్పుడు వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది . ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో కృతి శెట్టి కి గట్టి షాక్ తగిలినట్లు అయిందని చెప్పవచ్చు.దీన్ని బట్టి చూస్తే కథలను ఏమాత్రం వినకుండా వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లే ఒప్పేసుకుందని తెలుస్తోంది. 3 హిట్స్ తో కోటి రూపాయలు అందుకున్న ఈమె..రెమ్యూనరేషన్ కాస్త ఇప్పుడు కొండ నుంచి దిగిందని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనా కృతికి కష్ట కాలం మొదలైందేమో అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి . ఇకనైనా అటు ఇటు సినిమాలో ఒప్పుకోకుండా మంచి కథ, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version