హుస్సేన్‌ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు సీరియస్

-

హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్ పై విచారణపై ఇవాళ తెలంగాణ హైకోర్టు చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అంశంపై వివరాలు కోరిన హైకోర్టు.. వివరాలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, సీపీకి ఆదేశాలు జారీ చేసింది. జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు?రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చర్యలేంటి? అని జీహెచ్‌ఎంసీ, సీపీని హైకోర్టు ప్రశ్నించింది.

ఈ మేరకు సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని పేర్కొంది హైకోర్టు. ఇళ్లల్లోనే మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు.. సూచనలు కాదు.. స్పష్టమైన ఆదేశాలు ఉండాలని ఫైర్ అయింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు వ్యాఖ్యనించింది. ఇక వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version