దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి కోర్టులో వాయిదా పడుతూ వస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరినీ నిర్దోషులుగా తేలుస్తూ… చారిత్రాత్మక తీర్పును వెలువరించారు జడ్జి సురేంద్ర యాదవ్. అయితే జడ్జి సుకేంద్ర యాదవ్ ఈ బాబ్రీ మసీదు కేసులో తీర్పును వెలువరించిన అనంతరం రిటైర్ అయ్యారు.
న్యాయమూర్తి సుకేంద్ర యాదవ్ గత ఏడాది రిటైర్ కావలసి ఉంది. కానీ బాబ్రీ మసీదు కేసు లో పూర్తి న్యాయపరమైన తీర్పును వెలువరించేందుకు… సుప్రీంకోర్టు సురేంద్ర యాదవ్ పదవీ కాలాన్ని ఒక ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఆయన పదవి కాలం నేటితో ముగియనుంది. ఇక ఈరోజు బాబ్రీ మసీదు కేసులో తీర్పు ఇచ్చి చివరికి… న్యాయమూర్తి సుకేంద్ర యాదవ్ కూడా రిటైర్ అయ్యారు.