జగన్ కావాలనే కయ్యం పెట్టుకుంటున్నాడు.. కేసిఆర్ ఫైర్..?

-

మొదటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ల మధ్య మంచి స్నేహ బంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ జల హక్కు విషయంలో మాత్రం ఈ రెండు రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తోంది. ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కడ విమర్శలు చేసుకో లేదు కానీ ఆయా పార్టీల నేతలు మాత్రం విమర్శలు చేసుకోవడం ఆసక్తి కరం గా మారిపోయింది. ఇక ఇటీవలే హరీష్ జగన్ను టార్గెట్ చేసి పలు విమర్శలు చేయడం సంచలనంగా మారగ ఇక ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ పై విమర్శలు చేశారు.

నది జలాల హక్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే తమతో కయ్యం పెట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది అంటూ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనలు అన్నింటికీ సమావేశంలో దీటైన సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ తెలంగాణ జోలికి ఏపీ ప్రభుత్వం రాకుండా కుండలు బ్రద్దలు కొట్టినట్లు నిజాలను స్పష్టం చేయాలి అంటూ సూచించారు కేసీఆర్. కాగా అక్టోబర్ 6న అపెక్స్ సమావేశం జరగనుండగా… దీనిపై అధికారులకు రేపు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version