యశ్ తో విభేదాలపై మొదటిసారి స్పందించిన కేజిఎఫ్ నటి

-

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉమర్ సంధు.. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఫిలిం క్రిటిక్ గా చెప్పుకొని ఉమర్ సందు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ హీరో హీరోయిన్లను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో యశ్ గురించి వైరల్ కామెంట్స్ చేశారు. కాగా ఈ విషయంపై స్పందించారు కేజిఎఫ్ నటి.

ఫిలిం క్రెటిక్ ఉమర్ సంధు తాజాగా కేజిఎఫ్ హీరో యశ్ గురించి వైరల్ కామెంట్స్ చేశారు. ఇందులో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి యశ్ తో పనిచేయటానికి ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యారని మరొకసారి ఆ హీరోతో పని చేయను అంటూ తెలిపారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా యష్ మనుషుల్ని హెరైస్ చేసే వ్యక్తి అంటూ కూడా వైరల్ కామెంట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన శ్రీనిధి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

“పెద్దవారు చెబుతూ ఉంటారు.. ఒక వస్తువు ఎలా ఉందనేది అని కాకుండా అది ఎవరి చేతిలో ఉందనే విషయం మీద ఫలితం ఆధారపడి ఉంటుందని.. కొంతమంది ఎప్పుడు సోషల్ మీడియాలో విద్వేషాన్ని, దుష్ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తూ ఉంటారు.. కానీ నేను మాత్రం ప్రేమను నా జీవితంలో ఎదగడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వాడుకుంటాను.. మరోసారి చెబుతున్న కేజిఎఫ్ వరల్డ్ గురించి యష్ గారితో పని చేయటం నిజంగా ఒక అద్భుతమైన గౌరవం అనే చెప్పాలి. ఆయనతో పని చేయడం అదృష్టం. యశ్ ఒక జెంటిల్మెన్.. ఒక మెంటార్ కూడా.. ఒక మంచి స్నేహితుడు.. ఒక ఇన్స్పిరేషన్.. నేను ఎప్పటికీ అతనికి అభిమానినే..” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version