ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకను చూడాలని కోరుకొని వారు ఎవరు ఉంటారు. అందులో ముఖ్యంగా తమ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే ఆనందం మాటల్లో చెప్పలేం. ఈ ఆనందాన్ని తమ చుట్టూ ఉండే కుటుంబ సభ్యులతో కచ్చితంగా పంచుకుంటారు. అయితే ఆస్కార్కు నామినేట్ అయిన సినిమాలకు కొన్ని పాస్ లో కేటాయించబడతాయి. మరి మిగిలిన వారు ఆస్కార్ వేడుకను చూడాలనుకుంటే ఒక్కో మనిషికి ఎన్ని లక్షలు అవుతుందో తెలుసుకుందాం.
ఆస్కార్ వేడుకకు నామినేట్ అయిన సినిమాలకు కొన్ని పాసులు ఉచితంగా లభిస్తాయి. కానీ ఎక్కువమంది ఈ వేడుకను చూడాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆస్కార్ వేడుకకు హాజరు అవ్వాలంటే ఒక మనిషికి ఒక పాస్ 25 డాలర్లుగా ఉంటుందని సమాచారం. మన భారతీయ కరెన్సీలో దాదాపు 20 లక్షల రూపాయలు. అంటే ఒక మనిషి ఆస్కార్ వేడుకను చూడాలి అంటే కచ్చితంగా 20 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే.
ఈ లెక్కన చూస్తే అర్ఆర్ఆర్ టీం లో కొందరికి మాత్రమే ఫ్రీ పాసులు ఉండి ఉంటాయి. జక్కన్న తన కుటుంబ సభ్యులతో పాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఉపాసన వీరందరూ ఆస్కార్ వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన వారందరూ కచ్చితంగా డబ్బులు చెల్లించి ఆస్కార్ పాసులు తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా ఇంత ప్రతిష్టాత్మకమైన వేడుకలో ఆస్కార్ విజేతలకు ఎలాంటి నగదును చెల్లించారనే విషయం తెలిసిందే ఆస్కార్ అవార్డు అంటేనే అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైనది. ఈ అవార్డు రావటమే గొప్పగా భావిస్తారు కాబట్టి ఎలాంటి నగదు చెల్లించారు. అలాగే ఆస్కార్ అవార్డును అందించే వారికి కొన్ని నిబంధనలు సైతం వర్తిస్తాయని తెలుస్తోంది. అకాడమీ నిబంధనల ప్రకారమే విజేతలు నడుచుకోవాల్సి కూడా ఉంటుంది. ఆస్కార్ అవార్డు ట్రోఫీ ని అమ్మటం కానీ పారేయటం కానీ చేయకూడదు. ఒకవేళ వద్దు అనుకుంటే ఆకాడమీ వాళ్లే ఒక డాలర్ చెల్లించి వెనక్కి తీసుకుంటారు. ఇలా కాకుండా ఎవరైనా ఆస్కార్ ట్రోఫీని అమ్మదలిస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు అకాడమీకి ఉంటుంది.