వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. మెసేజ్ ‘ఎడిట్’ ఆప్షన్..!!

-

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. త్వరలో మెసేజ్ ‘ఎడిట్’ ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఆప్షన్ వల్ల మనం వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లలో ఏదైనా తప్పుంటే.. ఎడిట్ చేసుకోవచ్చు. సాధారణంగా చాలా మంది మెసేజ్ చేస్తే తప్పులు దొర్లుతుంటాయి. అప్పుడు ఆ పూర్తి మెసేజ్‌ను డిలేట్ చేసి.. మళ్లీ టైప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఈ ఎడిట్ ఆప్షన్‌తో మిస్టేక్ ఉన్న చోట ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై వాట్సాప్ పరీక్షలు నిర్వహిస్తోందని ‘వాబీటాఇన్ఫో’ అనే వెబ్‌సైట్ వెల్లడించింది.

WhatsApp

వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని సెలక్ట్ చేస్తే.. కేవలం కాపీ, ఫార్వర్డ్ వంటి ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే, ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా యాడ్ అవ్వనుంది. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేసినట్లు అయితే.. మెసేజ్‌లో ఏమైనా తప్పులున్నా.. ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్ టెస్టింగ్ దశలో ఉందని పేర్కొంది. ఐఓఎస్, డెస్క్‌ టాప్ వెర్షన్‌లలో కూడా ఈ ఎడిట్ ఆప్షన్ తీసుకొస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version