ఇటీవల తెలుగుదేశం పార్టీలో వన్ మ్యాన్ షో కనిపిస్తుందని చెప్పొచ్చు..చంద్రబాబు తప్ప ఇటీవల చినబాబు అలియాస్ నారా లోకేష్ పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. మొత్తం చంద్రబాబే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కావడం కావొచ్చు…పార్టీ పరంగా కార్యక్రమాలు చేయడం..అలాగే ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే అక్కడకు బాబు వెళ్లిపోతున్నారు. తాజాగా మాచర్లలో వైసీపీ నేతల చేతుల్లో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య చేయబడిన విషయం తెలిసిందే.
అయితే హత్య జరిగిన వెంటనే బాబు రంగంలోకి దిగేశారు. ఆయన స్వయంగా బాధితుడు ఇంటికి వెళ్లారు. ఇలా ఏది జరిగినా సరే చంద్రబాబే చూసుకుంటున్నారు. చినబాబు మాత్రం బయటకు రావడం లేదు. కానీ కొన్ని నెలల క్రితం ఇలా చినబాబు యాక్టివ్‌గా పనిచేసేవారు. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఏమన్నా సమస్యలు వస్తే చినబాబు వెళ్లిపోయేవారు. ఆ మధ్య కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు హత్య జరిగితే చినబాబు రంగంలోకి దిగేశారు. అలాగే ఆ మధ్య గుంటూ
రులో ఒక ఉన్మాది చేతిలో రమ్యశ్రీ అనే యువతి హత్య చేయబడింది. అప్పుడు కూడా చినబాబు వెళ్లారు. అలాగే అక్కడే అరెస్ట్ కూడా అయ్యారు.
అలా దూకుడుగా ఉన్న చినబాబు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దీనికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. చినబాబు హడావిడిగా తిరగడం వల్ల..ఆయనే టీడీపీ సీఎం అభ్యర్ధి అని వైసీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారం టీడీపీకి డ్యామేజ్ జరుగుతుంది. అందుకే చినబాబుని, చంద్రబాబు సైలెంట్ చేశారు.
ఇదే సమయంలో చినబాబు సరైన టైమ్‌లో బయటకు తీసుకొస్తారని తెలుస్తోంది. అలాగే చినబాబుతో పాదయాత్ర కూడా ప్లాన్ చేశారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే చినబాబు ఎంటర్ అవుతారని అంటున్నారు. మరి చూడాలి చినబాబు చేత పాదయాత్ర ప్లాన్ చేస్తారో లేదో.