సినిమాపై ఉన్న ఆసక్తితో ఎంతోమంది నటుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాంటి వారిలో ‘ది లెజెండ్’ హీరో శరవణన్ ఒకరు. 52ఏళ్ల వయసులో హీరోగా గ్రాండ్‌గా సిల్వర్‌స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి.. దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకున్నారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో వెలుగులోకి వచ్చారు. జేడీ, జెర్రీల ద్వయం దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని రూ.60కోట్ల బడ్జెట్‌తో సొంతంగా నిర్మించారు. కానీ ఈ మూవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు.
అయితే తొలి ప్రయత్నం విఫలమైనా శరవణన్ మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారన్నది కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది.
కోలీవుడ్ వర్గాల ప్రకారం.. త్వరలోనే ఆయన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారని, ఈ సారి ఏకంగా లవర్‌బాయ్‌గా మారబోతున్నారట. రోమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది.
ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో చర్చలు జరిపి, కథను ఫైనల్ చేశారట. త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. అన్నట్లు.. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమేనట.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిసింది.
ఇక శరవణన్..’లెజెండ్’ అనే చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేశారు. ఐదు పదుల వయసులోనూ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గనంటూ ఆ సినిమాలో నటించారు. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్ సైతం నెట్టింట్లో హల్చల్ చేశాయి.