బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడు.. కానీ చివరికి..!

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ బట్టతల అనేది సర్వసాధారణంగా మారిపోయింది. కానీ కొంతమందికి బట్టతల కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చి పెడుతోంది అనే విషయం తెలిసిందే. చిన్నవయసులోనే బట్టతల రావడం తో ఇక ఎంతో ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు చాలామంది. ఇక అంతే కాదు బట్టతల ఈ మధ్యకాలంలో పెళ్లికి పెద్ద ఆటంకంగా మారిపోతుంది. ఇక్కడ ఒక వ్యక్తికి బట్టతల ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టింది.

పెళ్లికి ముందు తనకు బట్టతల ఉంది అన్న విషయాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. కానీ పెళ్లి తరువాత బట్టతల బయటపడడంతో మోసం చేశాడు అంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆసక్తికర ఘటన ముంబై లో చోటుచేసుకుంది ముంబైకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ కు గత నెలలో పెళ్లి అయింది. ఇక కొన్నాళ్లకు సదరు వ్యక్తికి బట్టతల ఉంది అన్న విషయం బయటపడింది. పెళ్లికి ముందు తనకు బట్టతల గురించి చెప్పకుండా పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది సదరు యువతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version