తాజ్‌మహల్‌కు నోటిసులిచ్చిన మున్సిపల్‌ శాఖ.. ఆర్కియాలజిస్ట్ స్పందనపై పలు అనుమానాలు..

-

తాజ్‌ మహల్‌.. చాలామంది డ్రీమ్‌ ప్లేస్.. లైఫ్‌లో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలి అనుకుంటారు.. అలాంటి చారిత్రక తాజ్ మహల్ లాంటి చారిత్రక కట్టడానికి నోటీసులా ? గడువులోగా ట్యాక్స్ చెల్లించకుంటే ఆస్తిని జప్తు చేస్తారా అని అవాక్కవుతున్నారా ? ఆశ్చర్యపోకండి.. మీరు చదివింది నిజమే. ఈ నోటీసులు ఇచ్చింది ఇంకెవరో కాదు..తాజ్ మహల్ ఉన్న ఆగ్రా నగర మునిసిపాలిటీ విభాగం వాళ్లే పన్ను బకాయిలు కింద ఈ నోటీసులు ఇచ్చారు. తాజ్ మహల్ లాంటి పురాతన కట్టడాలు పురావస్తు శాఖ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సంబంధిత అధికారులకు ఈ నోటీసులు అందించారు.
తాజ్ మహల్‌కి ఆగ్రా మున్సిపల్ వాటర్ సప్లై చేసినందుకు గాను సుమారు రూ. కోటి రూపాయల వరకు వాటర్ బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆగ్రా మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతే కాదు.. తాజ్ మహల్ ప్రాపర్టీ టాక్స్ కూడా బకాయి పడిందట. ఆగ్రా మున్సిపల్‌ కార్పొరేషన్ ప్రాపర్టీ టాక్స్ విభాగం ఉన్నతాధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. తాజ్ మహల్ మునిసిపాలిటీ కార్పొరేషన్‌కి దాదాపు రూ. 1.40 లక్షలు ప్రాపర్టీ టాక్స్ చెల్లించాల్సి ఉంది.
2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ బిల్లులు బకాయిలు పడినట్టు ఆగ్రా మున్సిపల్‌ కార్పొరేషన్ తమ నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లోగా పన్నులు చెల్లించకపోతే ఆస్తిని జప్తు చేసుకుంటామని హెచ్చరించింది. అయితే, ఈ వివాదంపై పురావస్తు శాఖ తరఫున సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ స్పందిస్తూ.. పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చే చారిత్రక కట్టడాలకు అలాంటి పన్నులు వర్తించవు అని అన్నారు. ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పొరపాటున ఆ నోటీసులు జారీ చేసినట్టున్నారు. వాళ్లకు అసలు విషయాన్ని వివరిస్తూ రిప్లై ఇస్తామని ఆయన తెలిపారు.
పురావస్తు కట్టడాలకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకపోతే.. మరీ ఇప్పటివరకూ చెల్లించిందా..? మున్సిపల్‌ శాఖ కేవలం 2021-22, 2022-23 బిల్లులు బకాయి పడినట్లు మాత్రమే చెప్పింది.. అంటే ముందు చెల్లించినట్లేనా..? అప్పటి వరకూ చెల్లిస్తే.. అప్పుడు ఎందుకు ఈ రూల్స్‌ పాటించలేదు.. ఇది చాలా అనుమానాలకు దారితీస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version