స్టేజ్ పైనే అందరూ చూస్తుండగానే భయంకరంగా కొట్టుకున్న కొత్త జంట..వీడియో..

-

మన దేశంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళు జరుగుతాయి..అయితే జీవితంలో ఒకసారి జరిగే ఈ పెళ్ళి వేడుకలను ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు. ఇరు కుటుంబాల హడావుడి ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసే అతి చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది.మొహమాటానికి వెళ్లి ఏమీ అనకుండా ఉంటారు. మరీ మితిమీరితే తప్పితే.. ఇలాంటివన్నీ వధూవరులు భరిస్తుంటారు.

అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు. కాలానికి అనుగుణంగా మనుషులు కూడా మారుతుంటారు. ఈ విషయంలో నేటి వధువులు చాలా అప్‭డేట్ అవుతున్నారు.అమ్మాయిలు తమకు నచ్చనిదాన్ని భరించడానికి ఇష్టపడడం లేదు. సందర్భం ఏదైనా ముఖం మీదే తాడోపేడో తేల్చుకుంటున్నారు. అది పెళ్లి స్టేజ్ అయినా సరే. కొద్ది రోజుల క్రితం వరుడు విగ్గు పెట్టుకున్నాడని తెలిసి వధువు పీటల మీద ఉన్న పెళ్లిని రద్దు చేసుకుంది. మరొక ఘటనలో కట్నం అడిగాడని పెళ్లి రద్దు చేసుకుంటున్నారు..

ఇలాంటి వింత ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి..అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..అందులో తనకు బలవంతంగా స్వీట్ తినిపించబోయిన వరుడి చెంప చెల్లుమనిపించింది వధువు. అనంతరం ఇద్దరు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు.అయితే ఇది ఎంత వరకు నిజం, ఎంత వరకు అబద్ధం అనే విషయంలో క్లారిటీ లేదు కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పెళ్లి జరగుతుండగా అమ్మాయికి స్వీట్ తినిపించాలని స్నేహితులు అడిగారు.

అందుకు వరుడు స్వీట్ తీసుకుని వధువుకు తినిపించబోయాడు. ఆమె వద్దని చెప్పింది. అయినా బలవంతంగా తినిపించబోయాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చిన వరుడి చెంప చెల్లుమనిపించింది. వరుడికి కోపం వచ్చి తిరిగి ఆమెను కొట్టారు. అనంతరం ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకుంటుండగా బంధవులు, స్నేహితువులు వారిని విడదీశారు..అయిన కూడా వాళ్ళు తగ్గలేదు..ఆ వీడియో క్లిప్ ను మీరు కూడా చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version