నెక్స్ట్ మినిస్టర్ అన్నారు.. అమ్మాయి ఆడియో క్లిప్.. రోడ్డున ప‌డ్డా.. పృథ్వీ

-

సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలామంది రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక అక్కడ బెడిసి కొడితే మాత్రం వారి బతుకులు చిన్నాభిన్నమై పోతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి వారిలో సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని.. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ బెడిసికొట్టడంతో రోడ్డున పడ్డ పృథ్వీ గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఒక్క డైలాగ్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల పలు ఇంటర్వ్యూల ద్వారా వైసిపి పార్టీ తనను ఎలా మోసం చేసిందో చెబుతూ బాగా పాపులర్ అవుతున్నాడు పృథ్వీ.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం కి హాజరైన పృధ్వీ.. వైసిపి పార్టీ తనను ఎలా మోసం చేసిందో చెబుతూనే ఉగ్రవాదుల శిక్షణ కేంద్రం అంటూ వైసీపీ పై విరుచుకు పడ్డాడు. ఇక వైసీపీలో కులగజ్జి చాలా ఉంది అని
..ఆ కుల గజ్జితోనే ఇతర కులాల వారికి అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ కూడా ఆరోపించాడు. ఇకపోతే తాను టీటీడీ ఛానల్ లో పని చేసేటప్పుడు అక్కడున్న వైసిపి రాజకీయ నాయకులు తనను చాలా అవమానించారు .. ఇక మాట్లాడుతూనే బట్టలు విప్పేసారు అంటూ సంచలన కామెంట్లు చేశారు పృథ్వీ. ఇక అక్కడ ప్రతి విషయం కూడా చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలి.. మీరు చెప్పినట్లు వింటాం..మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆయన చుట్టూ తిరగాలి.. ఇక ఎమ్ ఏ చదివి కూడా ఎందుకు నాకీ కర్మ అని బాధపడ్డాను అంటూ తెలిపారు.ఇక బ్రహ్మోత్సవాల సమయంలో రాఘవేంద్రరావు చేసిన అద్భుతంలా.. మనం కూడా ఏదో అద్భుతం చేయాలనే ఆలోచనతో ఒక డైరెక్టర్ ను పెట్టుకుని చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేశాను . పెద్ద పెద్ద ఎల్ఈడి లలో ఎక్కడ చూసిన నా ఫోటో నే కనిపించింది .ఇక త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి అభిమానాన్ని సంపాదించుకోవచ్చు అని అనుకున్నాను. ఇక నెక్స్ట్ మంత్రి లేదా ఎంపీ అని అన్నారు. ఒక్క అమ్మాయి ఆడియో క్లిప్ విషయంలో నేను వెళ్లి విజయసాయిరెడ్డికి లెటర్ కూడా ఇచ్చాను. మొత్తం జరిగిందంతా తెలిపాను. ఇక సీఎం దగ్గరకు వెళ్లి పోయి నెక్స్ట్ కాబోయే సినిమాటోగ్రఫీ మంత్రి ని కూడా నేనే అని భ్రమ కల్పించారు. కట్ చేస్తే భార్య పిల్లల్ని కూడా దూరం చేసుకొని రోడ్డున పడ్డాను అంటూ బాధపడ్డాడు పృథ్వి.

Read more RELATED
Recommended to you

Exit mobile version