ఇప్పటి వరకూ ఏపీలో 9 లక్షల 74 వేల కోట్లు అప్పు అయ్యింది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ఈ అప్పుతో తలసరి అప్పు లక్షా 44 వేల 336 రూపాయలకు చేరింది అని అన్నారు.ఇది 5తెలుగుదేశం పార్టీ హయాంలో 74,790 ఉంటే.. వైసిపి పాలనలో డబల్ అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు.ఇటీవల 6 వైట్ పేపర్ల ద్వారా ప్రజలకు అన్ని విషయాలు తెలియజేశాం అని తెలిపారు.
ఈ రాష్ట్రం ఎలాంటి ఆర్దిక సంక్షోభంలో ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి అని అన్నారు.విభజన జరిగినప్పడు అశాస్త్రీయ, అన్యాయమైన రాష్ట్ర విభజన జరిగింది అని అసహనం వ్యక్తం చేశారు.రాజధాని హైదరాబాద్ గా అభవృద్ది చెందడం అది తెలంగాణకు వెళ్లడంతో ఇబ్బందులు వచ్చాయి అని అన్నారు.సమైఖ్యాంద్ర ప్రదేశ్ లో ఆధాయంలో వాటా 46 శాతం అయితే జనాభా 58 శాతం వస్తే అన్ని కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయి అని అన్నారు.2014-19 మధ్య కాలంలో అనేక ఎయిర్ పోర్టులను ..4386 కిలో మీటర్లు రోడ్లు తీసుకువచ్చాం అని గుర్తు చేశారు.