హెచ్‌సీయూలో నెమళ్ల అరుపులు ఫేక్ వీడియో కాదు.. అది తీసింది నేనే!

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ప్రభుత్వం అర్ధరాత్రి జేసీబీల ద్వారా చెట్లను తొలగిస్తున్న సమయంలో అక్కడున్న పక్షులు, నెమళ్లు పెద్దఎత్తున అరిచాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జంతుప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆందోళనలు, ప్రకృతి ప్రేమికుల పిటిషన్ల ద్వారా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టవద్దని స్టే విధించింది. అయితే, HCUలో నెమళ్ళ అరుపుల వీడియో ఫేక్ కాదని, AI వీడియో అని వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవమని వీడియో తీసిన విద్యార్థి మీడియా ముందుకు వచ్చి పేర్కొన్నాడు.మార్చి 31 రాత్రి 3 గంటలకు తీసిన వీడియో అది కుండబద్దలు గొట్టాడు.
ఈ వీడియో బైట్ ఇస్తున్నందుకు తనపై ఫేక్ కేసు పెట్టి, తన ఇంటి మీదకి పోలీసులను పంపిస్తారేమో అని భయంగా ఉందని సదరు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version