ఓర్ని..అదేమన్నా చాక్లెటా..ఇలా తయారయ్యారెంట్రా బాబు..

-

ఎందుకు అలా చేస్తారో తెలియదు కానీ పైసా లాభం లేకున్నా కూడా కొందరు విచిత్రమైన పనులు చేస్తారు..ముఖ్యంగా లవ్ కు సంబందించిన వాటిని సోషల్ మీడియాలో చూస్తూంటాము.. నవ్వులను తెప్పిస్తున్నవి కొన్ని అయితే, కోపాన్ని తెప్పిస్తున్నాయి.. వాటిని చూడడం వల్ల మన మనసుకు కొంత ఊరటగా ఉంటుంది. ఎందుకంటే వాటిని చూడగానే మనకు తెలియకుండానే నవ్వేసుకుంటాం.


ఇక అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వీడియోను చూస్తే.. పాపం అనిపించడం ఏమో కానీ పగలబడి నవ్వకుండా అయితే అసలు ఉండలేరు. ఇంకా ఈ రోజుల్లో ఫేమస్ కావాలంటే పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదని, వింతగా ప్రవర్తిస్తే చాలనే నిర్ణయానికి మీరు రావొచ్చు..

ఆ వీడియోలో ఓ యువకుడు తాను ధరించిన జాకెట్ మీద ‘ప్లీజ్ డొనేట్ మీ ఏ గాల్‌ఫ్రెండ్’ అని రాసిన ఒక స్టిక్కర్‌ను అతికించుకుని మెట్రో స్టేషన్ అంతటా తిరుగుతుంటాడు. ఇక అతన్ని ఆ మెట్రో స్టేషన్‌లో చూసిన వారందరూ నవ్వేసుకోవడాన్ని కూడా మనం చూడవచ్చు. ‘మోహిత్‌గౌహర్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయి వైరల్ అవుతున్న ఈ వీడియోకి ” నాకు ఒక గాల్‌ఫ్రెండ్‌ను దానం చేయండి” అనే కాప్షన్ కూడా రాసి ఉంది..దాన్ని చూసిన వారంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు..

మీరు అదే విధంగా చెయ్యండి..మంచి అమ్మాయి దొరుకుతుంది..జాబ్ డిటైల్స్ కూడా ఇవ్వండి అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..ఇలాంటి వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి..ఒక్కొక్కరి పిచ్చి ఒక్కొలా ఉంటుంది.. నెక్ట్స్ ఎవరూ ఎలా దర్శనం ఇస్తారో చూడాలి..ఆ వీడియో పై లైకొ కామెంట్ వేసుకోండి..
https://www.instagram.com/reel/ClV4GI2pWhy/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Exit mobile version