జమ్మూ కాశ్మీర్ లో పోలింగ్ ఎంత శాతం జరిగిందంటే..?

-

జమ్మూ కాశ్మీర్ ఇవాళ రెండో విడుత ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి విడుత ఎన్నికలు జరిగాయి. ఇవాళ రెండో విడుతీ జరగ్గా.. అక్టోబర్ 01న మూడో విడుత ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశలో 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూతులకు భారీ తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు 54 శాతం పోలింగ్ నమోదు అయింది.

సెప్టెంబర్ 18న మొదటి విడత పోలింగ్  ప్రశాంతంగా జరిగింది. దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. రెండో విడుత కూడా దాదాపు అదే రేంజ్ లో కొనసాగింది. మూడో విడుత మిగిలిన అన్నీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 08న ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపు పై ఎవరికీ వారు ధీమాగా ఉన్నారు. ఈసారి జమ్మూ కాశ్మీర్ లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version