Vettaiyan The Hunter : భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ప్రివ్యూ వీడియో..!

-

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం వెట్టైయాన్ ది హంటర్. టీ.జే.జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో ప్రముఖ లైకా ప్రొడక్షన్ సంస్థ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రివ్యూ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఇంతకు ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

పోలీస్ డిపార్టుమెంట్ లోని టాప్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ల ఫొటోలు చూపిస్తూ.. ఈ ఆఫీసర్ ఎవరో మీకు తెలుసా..? అంటూ అమితాబచ్చన్ అడుగుతారు. పేరు మోసిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ఓ ఆఫీసర్ సమాధానం చెబుతారు. ఈ దేశంలో లక్షలాది మంది పోలీసులున్నారు.  వారిని చూడగానే  గుర్తు పడుతున్నారు అది  ఎలా సాధ్యం అన్నారు. ట్రైనింగ్ తీసుకుంటోన్న మరో లేడీ ఆఫీసర్ ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ని భయపడకుండా ఎన్ కౌంటర్స్ చేయటం వల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ అని సమాధానం చెబుతుంది. మధ్య మధ్యలో రజినీకాంత్ డ్యూటీలో ఎంత పవర్ పుల్ గా వ్యవహరించారనేది.. ఎన్ కౌంటర్ ఎలా చేశారని చూపించారు. విలన్ గా రానాను అధ్బుతంగా చూపించారు. పహద్ పాజిల్, దుసరా విజయన్, అభిరామి, మంజు వారియన్ పాత్రలను పరిచయం చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను వీక్షించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version