భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే.. ఈ మార్పులు చేయాల్సిందే..!

-

భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలని పాటించాలి. ఇలా చేసినట్లయితే భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది. దృఢంగా మారుతుంది. కలకాలం కలిసి సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం దేవుడు విగ్రహాలని బెడ్రూంలో పెట్టుకోకూడదు ఇలాంటివి పెట్టుకోవడం వలన భార్యాభర్తల మధ్య బంధం బలహీనమవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు వస్తాయి. అలాగే ఎలక్ట్రానిక్ డివైస్లని బెడ్రూంలో ఉంచుకోకూడదు. ఇటువంటి వాటిని బెడ్ రూమ్ లో ఉంచడం వలన భార్యాభర్తల పై చెడు ప్రభావం పడుతుంది.

అలాగే బెడ్రూంలో భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోవడానికి నీటి సంబంధిత ఫోటోలు కారణం. కాబట్టి అటువంటి ఫోటోలని బెడ్రూంలో ఉంచుకోకుండా చూసుకోండి. అలాగే మంచం ఎదురుగా అద్దం ఉండడం కూడా భార్యాభర్తలకు మంచిది కాదు. ఇది కూడా ఇబ్బందుల్ని గొడవల్ని తీసుకువస్తుంది. బెడ్ రూమ్ లో ముదురు రంగులు వేయించుకోవడం మంచిది కాదు. బెడ్రూంలో కాస్త లేత రంగులు ఉండేటట్టు చూసుకోవాలి. పింక్, బ్రౌన్, పసుపు వంటివి బెడ్రూంలో ఉంచడం వలన భార్యాభర్తల మధ్య పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వారి బంధం బలంగా మారుతుంది.

బెడ్రూంలో ఎప్పుడూ చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. పనికిరాని సామాన్లు వంటివి పెట్టుకోకూడదు. బెడ్ రూమ్ ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. బెడ్ రూమ్ క్లీన్ గా ఉండేటట్టు చూసుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే అస్సలు గొడవలు రావు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం సరైన కమ్యూనికేషన్ వలన హాయిగా ఉండొచ్చు. అలాగే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. మంచి కమ్యూనికేషన్ వలన కూడా భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version