తెలంగాణ రాష్ట్రం లో కొత్త వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. తగ్గించిన వయో పరిమితి ని అనుసరించి తెలంగాణ రాష్ట్రం లో కొత్త వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హులైన వాళ్ళు ఈ నెల 31 లోగా ఈ సేవ/మీ సేవ ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, ghmc కమిషనర్ లకు ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. వృద్ధాప్య పెన్షన్ల కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల కు తగ్గింపు చేస్తూ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్గదర్శకాలు :
దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు.
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2 లక్షలు మించి ఉండకూడదు.
ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్‌కు అర్హులు కారు.
ఓటర్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు.
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరాకు అనర్హులు.