రష్మిక డిమాండ్స్ కు కళ్లెం వేసిన నిర్మాతలు.. కట్ చేస్తే..!

-

నేషనల్ క్రష్ రష్మిక గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకొని..ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా 2021 డిసెంబర్లో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె భారీగా క్రేజ్ దక్కించుకోవడంతో పారితోషకం విషయంలో కూడా డిమాండ్ చేస్తోంది. రూ.4కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తుంది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. నిజానికి సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తుండడంతో తన క్రేజ్ అమాంతం పెరిగిందని ఎంత పారితోషకం డిమాండ్ చేసినా సరే నిర్మాతలు ఇస్తారని భావించిన రష్మిక ఏకంగా ఒక్కొక్క సినిమా కోసం రూ.4 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తూ వచ్చిందని సమాచారం.

అయితే హీరోయిన్ గా క్రేజ్ మీద వున్న ఈమె.. పాపులారిటీకి తగ్గట్టుగా రూ. 4కోట్ల ,పారితోషకం కావాలని డిమాండ్ చేసిన రష్మికకు అవకాశాలు కూడా తగ్గాయి. గత ఆరు నెలలుగా ఈమె చేతిలో ఒక కొత్త ప్రాజెక్టు కూడా లేకపోవడం గమనార్హం. ఇకపోతే పారితోషకం అంత భారీగా పెంచితే ఏ ఒక్కరు కూడా అవకాశం ఇవ్వరని కాస్త ఆలస్యంగా గుర్తించినట్టుంది. ఎట్టకేలకు తన పారితోషకం విషయంలో దిగి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమాలో రష్మిక మద్దన్న హీరోయిన్గా ఎంపికైంది. ఇకపోతే రష్మిక ఇదివరకే భీష్మ సినిమాలో హీరోయిన్గా నితిన్ సరసన నటించిన విషయం తెలిసిందే.

మొదట్లో నితిన్ సరసన నటించడానికి రూ.4 కోట్ల రూపాయల పారితోషకం డిమాండ్ చేసిందని సమాచారం. కానీ ఇప్పుడు నితిన్ తో సినిమా చేయడానికి 2 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటుందని సమాచారం. రూ.4 కోట్లు డిమాండ్ చేసిన రష్మిక 2కోట్ల రూపాయలతోనే సరిపెట్టుకుంటుంది అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఈమె డిమాండ్స్ కి నిర్మాతలు కళ్ళం వేశారు అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version